మరో ప్రతిష్టాత్మక ఫిట్నెస్ రన్ కు వేదిక కానున్న హైదరాబాద్!
మరో ప్రతిష్టాత్మక ఫిట్నెస్ రన్ కు వేదిక కానున్న హైదరాబాద్!
SHTV Desk: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక ఫిట్నెస్ రన్ కు వేదిక కానుంది. డీపీఎస్, పల్లవి గ్రూప్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో మార్చి 29న భారీ స్థాయిలో యువ భారత్ రన్ జరగనుంది. ఫిట్ ఇండియా లక్ష్యంగా డీపీఎస్, పల్లవి గ్రూప్ విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి ప్రత్యేక చొరవతో ఈ రన్ జరుగుతోంది. 'ది నైల్ మైల్' వ్యవస్థాపకుడైన అనంత్ సంజీవ్ దూగర్ సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ రన్ లో స్కూల్ విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్, యువత అంతా కలిసి దాదాపు12 వేల మందికి పైగా పాల్గొనబోతున్నారు. 5km, 2km, 500m మూడు కేటగిరీల్లో సాగే ఈ రన్లో జుంబా, యోగా, మెడిటేషన్, ప్లేజోన్ తదితర యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0