మహిళా శక్తికి నిదర్శనం అపోలో ఫార్మసీ: ఉపాసన కొణిదెల
upasana kamineni
మహిళా శక్తికి నిదర్శనం అపోలో ఫార్మసీ - ఉపాసన కొణిదెల
సమాజ హితం, హైదరాబాద్ (28-02-2026): అపోలో ఫార్మసీ కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, ఇది మహిళా శక్తికి మరియు వారి నాయకత్వానికి నిదర్శనం" అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ (సి ఎస్ ఆర్ వైస్ చైర్ పర్సన్) ఉపాసన కొణిదెల పేర్కొన్నారు. తెలంగాణలో 1,000వ అపోలో ఫార్మసీ స్టోర్‌ను మియపూర్ లో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ మైలురాయిని చేరుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ, ఈ సంస్థలో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని, ఇది పూర్తిగా "మహిళా నేతృత్వంలోని సంస్థ" అని గర్వంగా ప్రకటించారు. తెలంగాణలో 1,000 స్టోర్లు మరియు దేశవ్యాప్తంగా 7,000కు పైగా అవుట్‌లెట్లతో అపోలో ఫార్మసీ ప్రజలకు అత్యంత చేరువలో ఉందన్నారు. భారతదేశంలో ఎవరైతే ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో వారే నిజమైన ఛాంపియన్స్ అని ఆమె కొనియాడారు. తమ టీమ్‌లోని ప్రతి సభ్యుడూ ఒక లీడర్ అని ప్రశంసించారు. అద్భుతమైన టీమ్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0