గోదావరి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

గోదావరి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Feb 24, 2026 - 14:05
Feb 24, 2026 - 14:06
 0  6
గోదావరి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా:  పరిశుభ్రత గోదావరి కోసం పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరిలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో "మన ఊరు మన గోదావరి" పరిశుభ్రత కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్  నాగలక్ష్మి తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను సామూహికంగా తొలగించారు. చాలా రోజుల నుండి పడివున్న చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గోదావరి నది పవిత్రతను కాపాడడానికి భక్తులు సైతం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన పాత బట్టలు ఇతర వస్తువులు సూచించిన ప్రదేశాల్లో వేయాలని, గోదావరి నీటిలో వేయడం వలన నది కలుషితం అవుతుందని మంత్రి అన్నారు. ధర్మపురి పట్టణంలో మిగిలి ఉన్న డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. పుణ్యస్నానాల కోసం లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు తీరప్రాంతంలో శుచి, శుభ్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని దీనిని గుర్తించిన నూతన మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉదయం నుండే కార్యక్రమం చేపట్టి శ్రమదానంలో పాల్గొన్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0